లార్డ్స్ (జూన్ – 30) : The Ashes 2023 లో భాగంగా ENGLAND vs AUSTRALIA జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 221 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి.
ఇంగ్లండ్ ను మొదటి ఇన్నింగ్స్ లో ,325 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 130/2 తో ఉంది. ఖావాజా (58*), స్మిత్ క్రీజులో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఫలితం కచ్చితంగా రానుంది.