ASHES 2023 : ఆస్ట్రేలియాదే మొదటి టెస్ట్

బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) ( జూన్ 20) : ASHES SERIES 2023 లో బాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్ల (AUSvsENG) మద్య జరుగిన మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఘనవిజయం (Australia won first test) సాధించింది.

చివరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరం కాగా ఉస్మాన్ ఖావాజా (USMAN KHAWAJA), ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఉస్మాన్ ఖావాజా నిలిచారు.

9వ వికెట్ కు ప్యాట్ కమ్మిన్స్ మరియు నాథన్ లియోన్ 50 కి పైగా పరుగులు జోడించి విజయం లో కీలక పాత్ర పోషించారు.

దీంతో ఇంగ్లండ్ మొదటి రోజు డిక్లర్ చేసిన బజ్ బాల్ క్రికెట్ ప్రయోగం విఫలమయింది.

ఇంగ్లండ్ : 393/8(D) & 273

ఆస్ట్రేలియా : 386 & 282/8