ASHES : ఐదో టెస్ట్ ఆరంభం ఆస్ట్రేలియాదే

ఓవల్ (జూలై – 28) : ASHES 2023 లో భాగంగా జరుగుతున్న చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ ఆడి 283 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ హ్యరి బ్రూక్ 85, క్రిస్ వోక్స్ 36 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు మర్పి రెండు వికెట్లతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 61 పరుగులతో ఆడుతుంది.

ఈ కీలకమైన యాసస్ సిరీస్ లో మొదటి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలవగా, మూడవ టెస్ట్ ఇంగ్లాండ్ గెలుచుకుంది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో 2-1 తేడాతో ఆస్ట్రేలియా జట్టు సిరీస్ లో ముందంజలో ఉంది. ఈ టెస్ట్ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. డ్రా లేదా ఆస్ట్రేలియా గెలిస్తే యాషెస్ – 2023 ఆస్ట్రేలియా సొంతం అవుతుంది.