మంచెస్టర్ (జూలై – 21) : ASHES 2023 లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 384 పరుగులతో ఉంది. 67 పరుగుల ఆధిక్యత ను సాదించింది. 5 టెస్ట్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 తో ముందంజలో ఉంది.
ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఆకాశమే హద్దు గా చేలరేగి 182 బంతుల్లో 189 పరుగుల భారీ శతకం బాదడంతో ఇంగ్లండ్ పైచేయి సాదించింది.
అంతకు ముందు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగులకే ఆలౌట్ అయింది. లుబుషెన్, మిచెల్ మార్ష్ అర్ద శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ – 5, బ్రాడ్ – 2 వికెట్లతో రాణించారు.