మంచెస్టర్ (జూలై – 23) : ASHES 2023 లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో 5వ రోజును పూర్తి గా వరుణదేవుడు తుడిచిపెట్టేశాడు… దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ గెలిచే స్థితిలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఆశల మీద వరుణుడు నీళ్ళు చల్లాడు. దీంతో 4 టెస్టులు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 – 1 తేడాతో సిరీస్ లో ముందంజలో ఉంది. 5వ టెస్ట్ జరగాల్సి ఉంది.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 592 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా… ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 214/5 పలుగులతో ఉన్న తరుణంలో వరుణదేవుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా జాక్ క్రాలీ నిలిచాడు.