హైదరాబాద్ (జూలై – 18) : ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని (arogya sri limit exceeded to 5 lakhs in telangana) ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
త్వరలో ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు డిజిటల్ కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం e KYC పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో డిజిటల్ కార్డులు తయారు చేసి జిల్లా ప్రజాప్రతినిధులతో పంపిణీ చేపట్టాలని సూచించారు.