Home > TELANGANA > AROGYA SRI – అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు – సీఎం రేవంత్

AROGYA SRI – అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు – సీఎం రేవంత్

BIKKI NEWS (JULY 16) : AROGYA SRI CARDS FOR ALL. ఈరోజు వైద్య ఆరోగ్యశాఖ పై అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆరోగ్యశ్రీ కార్డుల జారీ కొరకు రేషన్ కార్డులకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వడానికి చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రాష్ట్రంలోని ప్రతి పౌరుడు యొక్క ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ ను తయారు చేయాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికాలు పెంచాలని స్పష్టం చేశారు.

ఆర్ఎంపీలు పీఎంపీల సమస్యలు పరిష్కారం కొరకు అధికారులు చొరవ తీసుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు