భారీ ఆర్మీ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్.

తెలంగాణ లోని నిరుద్యోగులకు శుభవార్త హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో మార్చి 5 నుంచి 24 వరకు భారత ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ, పౌర సంబంధాలశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులను ఆర్మీలో చేర్చుకునేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

● రిజిస్ట్రేషన్ తేదీలు :: జ‌న‌వ‌రి 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు

● రిజిస్ట్రేషన్‌ పద్దతి :: ఆన్లైన్‌

●అడ్మిట్ కార్డుల విడుదల :: ఫిబ్రవరి 18 తర్వాత (ర్యాలీ నిర్వహించనున్న ప్రాంతానికి ఏ రోజు చేరుకోవాలనే సమాచారం ఆ కార్డుపై పొందుపరుస్తారు.)

● వివరాల కొరకు :: సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం.

● పోన్ నంబర్లు :: 040-27740059, 040-27740205.

‌● వెబ్సైట్‌ ::

http://www.joinindianarmy.nic.in

Follow Us@