ఆర్మీ రిక్రూట్మెంట్ క్వశ్చన్ పేపర్ లీక్.

దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దయ్యింది.

సైనికుల నియామకం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

పేపర్ లీక్ ఘటనలో పుణెకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఎలాంటి అక్రమాలక తావు ఉండకూడదనే ఉద్దేశంతో పరీక్ష రద్దు చేసినట్లు చెప్పారు.

ఆర్మీ సోల్జర్స్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం రూపొందించిన పేపర్‌ శనివారం రాత్రి లీకయినట్లు గుర్తించామన్నారు. ఈ ఉద్యోగాలకు మార్చి 2వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

Follow Us@