AGNIVEER RESULT : అగ్నివీర్ పరీక్ష ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ (మే 21) : భారత ఆర్మీలో ‘ఆర్మీ అగ్నివీర్ సీఈఈ రాత పరీక్ష – 2023’ నియామకానికి జరిగిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 375 పరీక్షా కేంద్రాలలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 26 వరకు అగ్నివీర్ నియామక పరీక్ష జరిగింది.

ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాలు (ARO) ల వారీగా పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. శనివారం విడుదల చేయని పలు ఏఆర్వోల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

◆ వెబ్సైట్ : joinindianarmy.nic.in