Home > ANDHRA PRADESH > APPSC – JL NOTIFICATION – పూర్తి నోటిఫికేషన్

APPSC – JL NOTIFICATION – పూర్తి నోటిఫికేషన్

BIKKI NEWS (JAN.31) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC J.L. NOTIFICATION 2024 WITH 47 POSTS) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 47 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుండి ఫిబ్రవరి 20 – 2024 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు..

నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఏప్రిల్ /మే – 2024లో నిర్వహించనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అర్హతలు : సంబంధించిన సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 18 – 42 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు గడువు : జనవరి – 31 నుండి ఫిబ్రవరి – 20 వరకు

దరఖాస్తు ఫీజు : 250/-

పరీక్ష విధానం :

పేపర్ – 1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) – 150 ప్రశ్నలు, 150 మార్కులు.(డిగ్రీ స్థాయిలో)

పేపర్ – 2 పీజీ స్థాయిలో సంబంధించిన సబ్జెక్టులో పరీక్ష – 150 ప్రశ్నలు, 300 మార్కులు

ప్రతి తప్పు సమాధానంకు 1/3 వంతు నెగెటివ్ మార్కులు తగ్గించబడును.

◆ సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు

ఇంగ్లీష్ – 9
తెలుగు – 2
ఉర్దూ – 2
సంస్కృతం – 2
ఒరియా – 1
మ్యాథమెటిక్స్ – 1
ఫిజిక్స్ – 5
కెమిస్ట్రీ – 3
బోటనీ – 2
జువాలజీ – 1
ఎకనామిక్స్ – 12
సివిక్స్ – 2
హిస్టరీ – 5

సబ్జెక్టు వారీగా సిలబస్ ను కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPLY HERE

APPSC J.L. DETAILED NOTIFICATION

APPSC J.L. NOTIFICATION & SYLLABUS

వెబ్సైట్ : https://appsc.aptonline.in/Default.aspx