APPSC : 720 గ్రూప్ – 2 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

విజయవాడ (అక్టోబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 720 గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (appsc group 2 notification with 720 posts) ను విడుదల చేయనుంది.

ఈ మేరకు ఇంతకుముందే 508 పోస్టులకు ఆమోదం ప్రభుత్వం తెలుపగా, తాజాగా 212 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు తెలిపారు. దీంతో మొత్తం 720 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అయింది. దీంతో నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.