Home > JOBS > APPSC > APPSC – DL NOTIFICATION – 290 డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్

APPSC – DL NOTIFICATION – 290 డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్

BIKKI NEWS (JAN. 24) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC D.L. NOTIFICATION 2024 WITH 290 POSTS) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 290 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 15 సబ్జెక్టు లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొదటగా ఇచ్చిన నోటిఫికేషన్ లో 240 పోస్టులను చూపించగా నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో 290 పోస్టులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 13 – 2024 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు..

నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్ష ఏప్రిల్ /మే – 2024లో నిర్వహించనున్నారు.

◆ సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు

బయోటెక్నాలజీ – 04

మైక్రోబయాలజీ – 04

ఇంగ్లీషు – 05

తెలుగు – 07

మ్యాథమెటిక్స్ – 25
ఫిజిక్స్ – 11
కెమిస్ట్రీ – 23
బోటనీ – 20
జువాలజీ – 2౦
ఎకనామిక్స్ – 15
పొలిటికల్ సైన్స్ – 16
హిస్టరీ – 15
కామర్స్ -40
కంప్యూటర్ అప్లికేషన్స్ – 49
కంప్యూటర్ సైన్స్ – 48

అర్హతలు, వయోపరిమితి సంబంధిత విషయాలను పూర్తి నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే వెల్లడించనున్నారు.

పరీక్ష విధానం :

పేపర్ – 1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) – 150 మార్కులు

పేపర్ – 2 (సంబంధించిన సబ్జెక్ట్ – పీజీ స్థాయిలో) – 300 మార్కులు

సబ్జెక్టు వారీగా సిలబస్ ను కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు లింక్ – Apply Here

APPSC D.L. NOTIFICATION & SYLLABUS

వెబ్సైట్ : https://appsc.aptonline.in/Default.aspx