APSRTC : అప్రెంటీసిప్ దరఖాస్తులు ఆహ్వానం

విజయనగరం (ఆగస్టు – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం (apprenticeship recruitment in apsrtc) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం జిల్లాలు విజయనగరం జోన్ పరిధిలోకి వస్తాయి

★ ఖాళీల వివరాలు

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్.

◆ అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

◆ ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.

★ ముఖ్యమైన తేదీలు

◆ దరఖాస్తు గడువు:15-08-2023

తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల
పరిశీలన తేదీ: 18-08-2023

విశాఖపట్నం, అనకాపల్లి సీతారామరాజు జిల్లాల
ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 19-08-2023

శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం జిల్లాల
ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 21-08-2023

◆ ధ్రువపత్రాల పరిశీలించే స్థలం: ఆర్టీసీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, వీటీ అగ్రహారం, విజయనగరం.

◆ వివరాలకు: 08922-294906.

◆ వెబ్సైట్ : https://www.apprenticeshipindia.gov.in/