విజయవాడ (మార్చి – 08) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది.
1) APEAPCET-2023 : ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసమే నిర్వహించే APEAPCET ప్రవేశ పరీక్షకు మార్చి11 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్, మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు.
2) AP ECET – 2023 : ఇంజనీరింగ్ సెకండియర్ లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈసెట్ కు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP ECET ప్రవేశ పరీక్ష మే 5న నిర్వహించనున్నారు
3) AP ICET – 2023 : ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ ప్రవేశం పరీక్ష దరఖాస్తును మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు చేసుకోవచ్చు.
AP ICET ప్రవేశ పరీక్ష మే 24, 25న నిర్వహించనున్నారు