న్యూడిల్లీ (అక్టోబర్ – 19) : APAAR – AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఐడెంటిటీ కార్డును జారీ చేయనుంది. Apaar students identity card
One nation One Card కార్యక్రమంలో భాగంగా ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ (APAAR) కార్డులను జారీ చేయడానికి కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.
17 అంకెలతో కూడిన ఈ అపార్ కార్డు విద్యార్థులకు అందజేయడానికి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ లేఖలు రాసింది. దసరా సెలవులు తర్వాత అన్ని రాష్ట్రాలలో అపార్ కార్డుల జారీ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా ఈ కార్డులను జారీ చేయడం జరిగింది.