BIKKI NEWS (OCT. 26) : APAAR enrollment in gjc nangunoor. ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరులో ప్రిన్సిపల్ బి. కిషన్ ఆధ్వర్యంలో కళాశాలలోని విద్యార్థుల APAAR (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టి) రిజిస్ట్రేషన్ కొరకు తల్లిదండ్రుల – అధ్యాపకుల సమావేశం నిర్వహించబడినది.
APAAR enrollment in gjc nangunoor
ఈ సమావేశాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ బి. కిషన్ మాట్లాడుతూ APAAR ID విద్యార్థుల యొక్క కేజీ టు పీజీ అన్ని సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేస్తూ ప్రభుత్వం ప్రతి విద్యార్థి సర్టిఫికెట్లను సురక్షితంగా కాపాడుతుందని ఈ ID కార్డ్ 12 అంకెలతో కూడిన నెంబర్లతో ఉండి భవిష్యత్తులో విద్యార్థి ఉద్యోగార్జనలో సులభతరం చేస్తుందని తెలియజేశాడు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో వచ్చిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో అధ్యాపకులు జ్యోతి, భీమ్రావు, భరత్, కవిత, స్వామి, శ్రీలత, దేవయ్య, రమణాచారి, బాల్ లింగం, రేవంత్ సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, జూనియర్ అసిస్టెంట్ కరుణ దీప్తి పాల్గొన్నారు.