AP DSC : త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ బొత్స

విజయవాడ (ఎప్రిల్‌ – 21) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వీలయినంత త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత టీచర్ ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఉపాధ్యాయ, ఉద్యోగ బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు దీనిపై సమగ్రమైన విధానాన్ని రూపొందించి బదిలీలు పారదర్శకంగా చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.