విజయవాడ (సెప్టెంబర్ – 30) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది టెట్ పరీక్ష 4,07,329 మంది రాయగా 58.7% మంది అర్హత సాధించారు.
టెట్ ను ఆన్లైన్లో విడతల వారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.