విజయవాడ (ఫిబ్రవరి – 28) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 411 సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా.. 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని APSLPRB పేర్కొంది.
★ SI క్వాలిఫైయింగ్ మార్క్స్ :
SI రాతపరీక్షలో రెండు పేపర్లను 200 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించిన APSLPRB.. ప్రతి పేపర్కు క్వాలిఫైయింగ్ మార్కులను ప్రకటించింది.
◆ OCలకు 40% (100కు 40 మార్కులు)
◆ BCలకు 35% (100కు 35 మార్కులు)
◆ SC, ST,EX-సర్వీసెమెన్లకు 30% (100కు 30 మార్కులు)
క్వాలిఫై అయిన వారు ఈవెంట్స్ (PMT/PET)కి అర్హత సాధిస్తారు. ఏ ఒక్క పేపర్లో అర్హత మార్కులు సాధించకపోయినా డిసీక్వాలిఫై అయినట్లే.