AP SI JOBS : PHYSICAL EVENTS SCHEDULE

విజయవాడ (ఆగస్టు – 12) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 411 ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ ( AP SI JOBS : PHYSICAL EVENTS SCHEDULE) షెడ్యూల్ ను APSLRB విడుదల చేసింది.

ప్రాథమిక పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన 57,923 మంది అభ్యర్థులకు ఆగస్టు 25 నుండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) పరీక్షలను నిర్వహించనున్నారు.

ఆగస్టు 14 నుండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లకు సంబంధించిన కాల్ లెటర్లను అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూల్ నగరాలలో ఈ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://slprb.ap.gov.in