రేపటి నుంచి ఒంటి పూట బడులే

విజయవాడ (జూన్ – 11) : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునః ప్రారంభం పై కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుండి జూన్ 17 వరకు ఒంటి పూట బడులనే (half day schools in andhra) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఉదయం 7.30 నిమిషాల నుంచి 11:30 నిమిషాల వరకే పాఠశాలలు నిర్వహించాలని పేర్కొంది.

జూన్ 19 నుంచి పాఠశాలలు యధావిధిగా రెండు పూటలు నడుపుకోవచ్చని తెలిపింది.