విజయవాడ (జూన్ – 26) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ – ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ఉన్న 4 సంస్థలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ లలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులలో 4,000 సీట్లు అందుబాటులో కలవు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.
దరఖాస్తు ఫీజు 300/- ₹, (SC, ST – 200/- ₹) గా కలదు. తాత్కాలిక ఫలితాలను జూలై 13న విడుదల చేయనున్నారు.
సర్టిఫికెట్ వెరిఫికెషన్ జూలై 21 న నూజివీడు, ఇడుపులపాయ కళాశాలల, జూలై – 24 న ఒంగోలు, శ్రీకాకుళం కళాశాలల అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఉంటుంది.
◆ వెబ్సైట్ : https://www.rgukt.in/Institute.php?view=Admissions23