నూజివీడు (జూన్ -27) : నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో (RGUKT) 2023-24 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సోమవారంతో దరఖాస్తు గడువు ముగిసింది.
ఈ విద్యా సంవత్సరం మొత్తం 38 వేల దరఖాస్తులు అందినట్లు ప్రవేశాల కన్వీనర్ గోపాలరాజు తెలిపారు. ఒక్కో సీటుకు సుమారు 9 మంది పోటీ పడుతున్నారని కన్వీనర్ చెప్పారు.