AP NEWS : 6,100 పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

విజయవాడ (డిసెంబర్ – 25) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLRB) 6,100 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియను జనవరి – 07 – 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ – 28తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో జనవరి 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వం అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తులు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే 4 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

జనవరి 22 న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.