విజయవాడ (జూన్ – 07) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 మోడల్ స్కూళ్ళలో ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల (ap model school hall tickets ) ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
జూన్ 11వ తేదీ ఉదయం 10:00. నుండి 12:00 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్షలో ఓసి, బిసి విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులను కనీసం పొంది ఉండవలెను. ఈ పరీక్షలో చూపిన ప్రతిభా ఆధారంగా – రిజర్వేషన్లు ఆధారంగా సీట్ల కేటాయింపు జరగనుంది.