AP DSC 2024 – రెండు నెలల తర్వాతే నోటిఫికేషన్.!

BIKKI NEWS (NOV. 18) : AP MEGA DSC NOTIFICATION AFTER 2 MONTHS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీన విడుదల చేయాల్సిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే విడుదల అయ్యే అవకాశాలు కనబడటం లేదు. దాదాపు రెండు నెలల తర్వాతనే ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

AP MEGA DSC NOTIFICATION AFTER 2 MONTHS

దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై తీర్పు ఇచ్చిన నేపథ్యంలో… ఎస్సీ వర్గీకరణ పై రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏకసభ్య కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నివేదికను తెప్పించుకున్న తర్వాతనే దాని ఆధారంగా డీఎస్సీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

తాజాగా మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం నోటిఫికేషన్ ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు