విజయవాడ (మే – 28) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష సోసైటీ నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో 1,358 టీచింగ్ పోస్టులను (ap kgbv contract teaching jobs 2023) కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులను మహిళ అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేశారు.
◆ ఖాళీల వివరాలు :
1) ప్రిన్సిపాల్ – 92
2) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 846
3) సీ.ఆర్.టీ : 374
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) : 46
◆ అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ వయోపరిమితి : జనరల్ అభ్యర్థులకు 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
◆ దరఖాస్తు ఫీజు : రూ.100./-
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : మే – 30- 2023 నుంచి జూన్ – 05 – 2023 వరకు.
◆ వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/