KGBV JOBS : నేటి నుండి ఇంటర్వ్యూలు

విజయవాడ (జూన్ – 23) : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష విభాగం రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ లో ఉన్న 1,543 పోస్టులకు జూన్ 23 నుండి 25 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఇంటర్వ్యూలకు 4,243 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

జిల్లా కేంద్రాలలో సంబంధిత అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి షార్ట్ లిస్టులను తయారు చేసిన విషయం తెలిసిందే.