KGBV JOBS : 1,358 కాంట్రాక్టు టీచర్లు పూర్తి నోటిఫికేషన్

విజయవాడ (మే – 29) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష సోసైటీ నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో 1,358 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తులను మహిళ అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తూ పూర్తి నోటిఫికేషన్ (AP KGBV JOBS DETAILED NOTIFICATION) ను జారీ చేశారు.

◆ ఖాళీల వివరాలు :

1) ప్రిన్సిపాల్ – 92
2) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 846
3) సీ.ఆర్.టీ : 374
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) : 46

◆ దరఖాస్తు ఫీజు : రూ.100./-

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : మే – 30 – 2023 నుంచి జూన్ – 05 – 2023 వరకు.

◆ 1: 3 నిష్పత్తి లో మెరిట్ లిస్ట్ విడుదల : జూన్ – 06, 07 తేదీలలో

◆ సర్టిఫికెట్ ల పరిశీలన జిల్లా స్థాయి కమిటీలతో : జూన్ 08, 09 తేదీలలో

◆ స్కిల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ జిల్లా స్థాయిలో : జూన్ 10, 11, 12 తేదీలలో

◆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల : జూన్ – 22

◆ అపాంట్‌మెంట్ ఆర్డర్స్: జున్ – 13

◆ కాంట్రాక్టు ఒప్పందం ప్రారంభం : జూన్ -13

◆ విధులలో చేరవలసిన తేదీ : జూన్ – 14

వయోపరిమితి : జనరల్ అభ్యర్థులకు 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

అర్హతలు :

  • ప్రిన్సిపాల్ : 50% మార్కులతో PG ఉత్తీర్ణత సాదించి ఉండాలి. (BC 45%, SC,ST, PH – 40% ) మరియు బీఈడీ కలిగి ఉండాలి.
  • PGT : సంబంధించిన సబ్జెక్ట్ లో పీజీ మరియు బీఈడీ
  • CRT : డిగ్రీ లో సంబంధించిన సబ్జెక్ట్ తో పాటు బీఈడీ లో సంబంధించిన సబ్జెక్ట్ మెథడాలజీ కలిగి ఉండాలి
  • PET : ఇంటర్మీడియట్, డిగ్రీ కలిగి ఉండాలి, UGDPEd లేదా BPEd, MPEd కలిగి ఉండాలి.

◆ ఎంపిక విధానం :
ఆకడమిక్ మెరిట్ (77%),
KGBV లలో వర్కింగ్ స్టాఫ్ (8%)
స్కిల్ టెస్టు ఇన్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్, డెమో, మోడల్ లెసన్ -15%

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/