విజయవాడ (అక్టోబర్ – 24) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 3,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైకోర్టు లో 241 పోస్టులు, జిల్లా కోర్టులలో 3,432 పోస్టులు కలవు.
◆పోస్టుల వివరాలు : ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఖాళీలు కలవు.
◆ అర్హతలు : పోస్టును అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్/స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
◆ వయోపరిమితి : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
◆ వేతనం : ఆయా పోస్టులను అనుసరించి రూ.20వేల నుంచి రూ.1,24,380 మధ్య.
◆ ఎంపిక విధానం : పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
◆ హైకోర్టు ఖాళీలకు గడువు : 25.10.2022 నుంచి 15.11.2022
◆ జిల్లా కోర్టుల ఖాళీలకు గడువు :22.10.2022 నుంచి 11.11.2022మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
Follow Us @