10,177 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

విజయవాడ (అక్టోబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 10,177 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్ ను గవర్నర్ జారీ చేశారు. ap govt regularized 10177 contract employees

కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్ టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2-6-2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన సంగతి తెలిసిందే.

ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

GAZETTE NOTIFICATION