కరోనా పాజిటివ్ వచ్చి విధులకు హాజరుకాని ఉద్యోగులకు 20 రోజుల సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజులు ప్రత్యేక సెలవులుగానూ, 5 రోజులు హాఫ్ పే లీవ్ కింద పరిగణించనున్నారు.
కొవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్నవారికి ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగం చేసే వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ సోకినా.. ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది.