విజయవాడ (జూలై – 06) : ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలల (AP Degree Colleges admissions 2023) రిజిస్ట్రేషన్లు గడువును మరోసారి పొడిగించారు. జులై 12 వరకు అభ్యర్థులకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
జూలై 15 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 24న సీట్ల కేటాయింపు ఉంటాయని వెల్లడించారు.
◆ వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/OAMDC23/OAMDCHome.html