విజయవాడ (మే – 18) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా విభాగం 2023 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిఎల్ఈడి (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం AP DEECET 2023 నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రభుత్వ డైట్ కాలేజీలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లలో ప్రవేశం కల్పిస్తారు.
◆ అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
◆ వయోపరిమితి : సెప్టెంబర్ – 01 ; 2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
◆ ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
◆ దరఖాస్తు గడువు : మే – 28 – 2023 వరకు కలదు.
◆ హాల్ టికెట్ల జారీ : జూన్ – 05 – 2023
◆ ప్రవేశ పరీక్ష తేదీలు : జూన్ 12, 13 వ తేదీలలో నిర్వహించనున్నారు
◆ వెబ్సైట్ : www.apdeecet.apcfss.in