విజయవాడ (జూలై – 19) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల రెండో ఎంపిక జాబితాను (ap court jobs – office subordinate 2nd selection list 2023) ఈరోజు విడుదల చేశారు.
ప్రాథమికంగా 63 మంది అభ్యర్థుల ఎంపిక కాగా వారి వివరాలు అధికారిక వెబ్సైట్ లో ఉంచారు. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
మొదటి జాబితాలో 90 అభ్యర్థుల ఎంపిక కాగా 70 విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి గాను రెండో జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జులై 24, 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.