ఆరు రకాల ఫీజులు రద్దు చేసిన ఏపీ ఇంటర్ విద్యా మండలి.

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ విద్యామండలి విద్యార్థుల నుండి వసూలు చేసే ఆరు రకాల ఫీజులను ఈ సంవత్సరానికి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్‌ విద్యామండలి ఉత్తర్వుల ప్రకారం

  • రీ-అడ్మిషన్.
  • సెకండ్ ఇయర్ లో టీసీతో మరో కళాశాలలో ప్రవేశం.
  • ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, మాధ్యమం, గ్రూపు మార్పు.
  • సెకండ్ ఇయర్ లో గ్రూపు మార్చుకోవడం వంటి ఆరు రకాల సేవలకు ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే బోర్డుకు చాలా మంది విద్యార్థులు ఫీజులను చెల్లించారు. ఈ ఫీజుల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Follow Us@