విజయవాడ (జూన్ – 02) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.
పరీక్షకు గంటముందే కేంద్రానికి చేరుకోవాలని.. హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఐడి కార్డు తీసుకొని రావాలని అధికారులు సూచించారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:45 గంటల వరకు జరగనున్నాయి.