10వ తరగతి పరీక్షలలో 7 పేపర్లు

విజయవాడ (ఆగస్టు – 09) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుంచి పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లతో పరీక్ష నిర్వహించాలని (ap 10th class public exams with 7 papers ) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్ గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్ ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు.ళరెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు.

మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్ కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.