ANGANWADI JOBS : 56 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వైఎస్సార్ కడప (ఎప్రిల్‌ – 29) : వైయస్సార్ కడప జిల్లా మహిళ, శిశు సంక్షేమ సాధికారిత అధికారి జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 56 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ మినీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

◆ పోస్టుల వివరాలు :

  1. అంగన్వాడీ వర్కర్: 12 పోస్టులు 2. అంగన్వాడీ హెల్పర్: 40 పోస్టులు
  2. మినీ అంగన్వాడీ వర్కర్: 04

◆ అర్హతలు : 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

◆ వయోపరిమితి : 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.

◆ వేతనం : నెలకు అంగన్వాడీ వర్కర్ కు రూ.11,500; అంగన్వాడీ హెల్పర్/ మినీ అంగన్వాడీ వర్కర్ కు రూ.7000.

◆ ఎంపిక విధానం : పదోతరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

◆ చివరి తేదీ: మే – 03 – 2023

◆ ఇంటర్వ్యూ తేదీ : మే – 09 – 2023

◆ వెబ్సైట్ : https://kadapa.ap.gov.in/