AP ENGINEERING COUNSELLING : జూలై 24 నుండి ప్రారంభం

విజయవాడ (జూలై – 19) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ (andhra pradesh engineering counselling schedule 2023) జూలై 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. AP EAPCET 2023 లో పొందిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

జూలై 24 నుంచి ఆగస్టు 03 వరకు రిజిస్ట్రేషన్లు,

జూలై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన

ఆగస్టు 3 నుంచి 8 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం

ఆగస్టు 9న వెబ్ ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు

ఆగస్టు 12న సీట్ల కేటాయింపు చేయనున్నారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 13-14 తేదీల్లో కళాశాలలో చేరాలని పేర్కొన్నారు. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి..