ఆనందయ్య కరోన మందు కోసం భారీగా తరలివస్తున్న జనం

కరోనా చికిత్సకు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం కోసం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి జనం భారీగా తరలివచ్చారు. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిందని సమాచారం.

ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేస్తున్నట్లు సమాచారం. బొనిగి ఆనందయ్య అనే స్థానిక ఆయుర్వేద వైద్యుడు ఈ మందు పంపిణీ చేస్తున్నారు.

ఆనందయ్య మందు కోసం వస్తున్న వాహనాలు

ఈ ఆయుర్వేద మూలిక వ్యవహారం ప్రభుత్వ అధికారుల వరకు వెళ్లింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నాటు మందుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. మందు తయారీలో వాడుతున్న మూలికలు, ఇతర వివరాలను ఆనందయ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకపోవడంతో తయారీతోపాటు పంపిణీ ఆపేయాలని ఇటీవల ఆదేశించారు.

స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి చొరవ చూపడంతో తిరిగి ఇవాళ్టి నుంచి మందు పంపిణీ ప్రారంభమైంది. దీంతో మారుమూల గ్రామానికి జనం పొటెత్తుతున్నారు.

అయితే ఈ మందు పంపిణీ పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు

Follow Us@