తెలంగాణకు విముక్తి కల్పించిన తర్వాత కేసీఆర్ తలపెట్టిన “కాంట్రాక్టు” పద విముక్తికి గ్రీన్ సిగ్నల్

bikki news editorial ✍️

  • 50 వేల మంది జీవితాలకు వెలుగు రేఖ హైకోర్టు తీర్పు
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిల్ ను కొట్టేసిన హైకోర్టు
  • 21 ఏండ్ల “తాత్కాలిక” పదానికి చరమగీతం పాడే తీర్పు
  • సమాన పనికి సమాన న్యాయం చెప్పిన తీర్పు

నిరుద్యోగుల బ్రతుకు తెరువు అవసరాన్ని స్వయంగా ప్రభుత్వాలే ఆసరాగా చేసుకుని వెట్టిచాకిరి, బానిసత్వం పదాలకు పర్యాయ పదంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషపు విజన్ నుండి పుట్టకొచ్చిందే “కాంట్రాక్టు ఉద్యోగులు” అనే ఆలోచన… రెగ్యులర్ ఉద్యోగి స్థానంలో అదే పనిని ఆ పోస్ట్ వేతనంలో 10 – 20% వేతనానికే చేసే బానిస వ్యవస్థే కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ…

బ్రతుకుదెరువు కోసం కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి అటు పూర్తి స్థాయి ఉద్యోగిగా కాకుండా ఇటు నిరుద్యోగిగా కాకుండా ఆశా నిరాశల మద్య గత 21 ఏళ్లుగా ఏ హక్కులు లేని వ్యవస్థ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా నిలిచిన కేసీఆర్ మరియు హైకోర్టు.

సీఎం కేసీఆర్ స్పీచ్

అలాంటి సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులు కై తెలంగాణ ఉద్యమం తో పాటు గొంతెత్తిన కేసీఆర్ “కాంట్రాక్టు కలెక్టర్, కాంట్రాక్టు ముఖ్యమంత్రి” ని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని కాంట్రాక్టు వ్యవస్థను ఎద్దేవా చేస్తూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి క్రమబద్ధీకరణ హమీ ఇచ్చి అధికారంలోకి రాగానే తన మాటే శాసనంగా ఉత్తర్వులు ఇవ్వడం చారిత్రాత్మక సహసోపేత నిర్ణయం. ఉత్తర్వులు రావడమే ఆలస్యం చకచకా జరిగిపోతున్న క్రమబద్ధీకరణ ప్రక్రియ పై న్యాయ వ్యవస్థ ఇచ్చిన స్టే కారణంగా గత ఐదు సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. అయినా అనేక ప్రయోజనాలను కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి గా కేసీఆర్ కల్పించారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిల్ ను కొట్టేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన ప్రధాన హమీలలో ఒకటైన “తెలంగాణలో కాంట్రాక్టు అనే పదం లేకుండా చేస్తా” అనే హమీకి పట్టిన గ్రహణం తొలగిపోయింది. 21 ఏండ్లుగా ఆధునిక, నయా బానిసత్వం అయినా కాంట్రాక్టు అనే వ్యవస్థను తెలంగాణ నుంచి కూకటి వేళ్ళతో సహ పెకిలించే అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి వచ్చింది.

కొన్ని శాఖలలో 80% పైగా కాంట్రాక్టు ఉద్యోగులే విధులు నిర్వహిస్తూ ఆ శాఖలలో ఉత్తమ ఫలితాల సాదనలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో 80% కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లే పని చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన నాటి నుండి కేసీఆర్ ఇస్తున్న పొత్సహంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్మీడియట్ విద్యా నూతన శిఖరాలను తాకింది. ఈ ఏడాది లక్షా 10 వేల అడ్మిషన్లతో కళకళలాడంటంలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్ర ముఖ్యమైనది.

పూర్తి స్థాయి అర్హతలతో, పూర్తి స్థాయిలో రాజ్యాంగ నియామకాలకు లోబడి నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులు ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసావాచా కర్మేణా తీసుకున్న క్రమబద్ధీకరణ హమీకి, చిత్తశుద్ధితో 21 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న కారణంగా ధర్మం, న్యాయంగా దక్కాల్సిన హక్కులు దక్కే అవకాశం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us @