BIKKI NEWS (NOV. 06) : America 47th President Donald Trump. అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ పూర్తి మెజార్టీ సాదించారు.
America 47th President Donald Trump
తాజా సమాచారం ప్రకారం ట్రంప్ 277, హ్యారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ట్రంప్ దాదాపు 51% ఓట్లు సాదిస్తే, హరీస్ – 47% ఓట్లు సాధించారు. మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్ నినాదంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
వరుసగా కాకుండా, రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న రెండవ దేశాధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు. 1892లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
రిపబ్లికన్ పార్టీ కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని డోనాల్డ్ ట్రంప్ తన విక్టరీ సందేశంలో పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో ఇది స్వర్ణయుగం కాబోతుందన్నారు. ఈ అత్యద్భుత విజయం అమెరికా ప్రజలకు చెందుతుందని, దీంతో అమెరికాను మరోసారి మళ్లీ ఉన్నతంగా నిలిపే అవకాశం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 45వతో పాటు 47వ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ తెలిపారు.
మరోవైపు ఓటమి నేపథ్యంలో కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
అమెరికా సేనేట్ మళ్లీ రిపబ్లికన్ ఆధీనంలోకి వచ్చేసింది. ట్రంప్ పార్టీ తాజా ఎన్నికల్లో కీలక సీట్లను నెగ్గింది. మెజారిటీ మార్క్‌ను దాటేసి 51 సీట్లను ట్రంప్ పార్టీ కైవసం చేసుకున్నది. డెమోక్రాట్లకు 40 సీట్లు దక్కాయి
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయాన్ని అందుకున్నారు