జనగాం (మార్చి – 05) : కళ్లెం గ్రామానికి చెందిన మబ్బు పరశురాంకి అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ బి.ర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు-2023 సంవత్సరమునకు గాను లెక్చరర్ మబ్బు పరశురాం ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు.
అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బి.యస్.ఎ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు ఇందులో భాగంగానే మబ్బు పరశురాంని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని ప్రకటనలో తెలియజేశారు.
పరశురాం మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు గాను తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు జాతీయ అవార్డు కమిటీ వారికి మరియు జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి.యస్.ఎ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాన్ విష్ణు, మొర్రి రవికుమార్ తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.