BRAOU ADMISSIONS 2024 – అంబేద్కర్ వర్శిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా అడ్మిషన్స్

BIKKI NEWS (JULY 30) : ambedkar open university admissions 2024. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లకు మాత్రమే వర్తిస్తుందని, దేశ వ్యాప్తంగా వర్తించదని పేర్కొన్నారు.

ambedkar open university admissions 2024

దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ – 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి.
పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులు కలవు.
పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది.

అర్హతలు

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి.

పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.

దరఖాస్తు గడువు : 30 – సెప్టెంబర్ – 2024 వరకు.

పాతవారికి అవకాశం :

ద్వితీయ తృతీయ సంవత్సరం విద్యార్థులు కూడా ఆగస్టు 18 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు

2015 – 16 నుండి 2023 – 24 విద్యా సంవత్సరాలలో అడ్మిషన్లు పొంది ట్యూషన్ ఫీజు చెల్లించని వారికి కూడా ఆగస్టు 18 లోపు ట్యూషన్ ఫీల్ చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. కావున విద్యార్థులు సంబంధిత స్టడీ సెంటర్లలో ట్యూషన్ ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు అని పేర్కొన్నారు

వెబ్ సైట్ : https://www.braouonline.in/

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు