ఎమ్మెల్సీ అలుగుబెల్లి ప్రెస్ మీట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు శాసనమండలి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

వెంటనే పాఠశాలలు, కళాశాలలు తెరవాలని‌, ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభించాలని కోరారు.

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గత కొన్ని సంవత్సరాలుగా పదోన్నతులు, బదిలీలు లేవని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఈ నెల 17 వ తేదీన జిల్లా కేంద్రాలలో చేపడుతున్న సామూహిక నిరాహారదీక్షకు మద్దతు తెలిపారు.

ఉద్యోగులకు పీఆర్సీ అమలు రెండు సంవత్సరాల నుంచి వాయిదా వేస్తున్నారని వెంటనే అమలు చేయాలని నిలదీశారు.

వేలాది పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని కోరారు.

యూనివర్సిటీలను వైస్ ఛాన్సలర్ లు కూడా లేకుండా నడుపుతున్నారని ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల బదిలీలపై సీఎం ప్రకటన చేసి అధికారికంగా లేఖ ఇవ్వకపోవడంతో నెల రోజులు అయినా కూడా బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదని వెంటనే సీఎం కేసీఆర్ బదిలీలపై అధికారికంగా లేఖను విద్యాశాఖకు పంపించి బదిలీ ప్రక్రియ త్వరగా జరిగేలా చూడాలని కోరారు.

Follow Us@