ఎమ్మెల్సీ అలుగుబెల్లి నడకయాత్ర కు సంపూర్ణ మద్దతు – కొప్పిశెట్టి

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈరోజు నుంచి 17వ తేదీ వరకు విద్యా, ఉద్యోగ, కార్మిక, కర్షకుల సమస్యల మీద నల్లగొండ నుంచి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకూ చేస్తున్న నడకయాత్ర విజయవంతం కావాలని TSGCCLA- 475 సంఘం నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

విద్యారంగం మరియు విద్యా రంగంలో పనిచేస్తున్న అధ్యాపకులు & కాంట్రాక్టు మరియు వివిధ రకాల శ్రమదోపిడికి గురవుతున్న వారి సమస్యలను మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళటానికి ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి సమస్యల పరిష్కారంలో సానుకూలత వ్యక్తం చేయాలని కోరుతూ TSGCCLA- 475 సంఘం నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు