విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీ అలుగుబెల్లి పాదయాత్రకు 475 సంఘం మద్దతు

ప్రభుత్వ విద్యా రంగం & అధ్యాపకులు& కాంట్రాక్ట్ లెక్చరర్స్ మరియు ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రజాస్వామ్యయుతంగా ఈనెల 14 నుంచి 17 వరకు నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్, టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష & కార్యదర్శులు ,

G. రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలియజేశారు.
పాదయాత్ర ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ అసోసియేషన్- 475తరపున పాదయాత్రలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ స్థాన చలనం గురించి ముఖ్యమంత్రి తమ కార్యాలయం ద్వారా నవంబర్ 15 ,2020న పత్రికా ప్రకటన ద్వారా హామీ ఇచ్చినప్పటికీ, ఇంతవరకు కాంట్రాక్ట్ లెక్చరర్ స్థానచలనం జరగక, వందలకొలది కాంట్రాక్ట్ లెక్చరర్స్ అనేక ఆర్ధిక, మానసిక, శారీరక, ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంపై మంత్రులు, అధికారులకు అనేకసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేదని, ముఖ్యమంత్రి హామీ ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ కు స్థానచలనం చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులు / కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ గురించి కోర్టు కేసులు విషయంలో ప్రభుత్వ చొరవ చూపాలని, క్రమబద్ధీకరణ జరిగేవరకూ D.A& H.R.A చెల్లిస్తూ, ప్రతినెల వేతనాలు చెల్లించాలని, కరోనా పాజిటివ్ తో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని ,కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు హెల్త్ కార్డులు ఇవ్వాలని ,తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ A.నర్సిరెడ్డికి ఇవ్వడం జరిగింది.

ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ బదిలీల సమస్యలను మరి ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది,

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కి సమర్పించే వినతి పత్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్యలు కూడా పొందుపరచడం జరిగింది అని తెలియజేశారు. ఈ సందర్భంగా 475 అసోసియేషన్ తరపున నర్సిరెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ,అసోసియేట్ ప్రెసిడెంట్ కేపీ.శోభన్ బాబు, మహిళా కార్యదర్శులు సంగీత, ఉదయశ్రీ రాష్ట్ర నాయకులు గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.