సీజేఎల్స్ టీడీఎస్ పై ఇంటర్ కమీషనర్ ని కలిసిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు నుండి నెలనెలా 10% టిడిఎస్ రూపంలో కోతలు విధించడాన్ని నిలుపుదల చేయాలని ఈరోజు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో TIGLA నాయకులు రామకృష్ణా గౌడ్, 475 సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్,మరియు శోభన్ బాబు కలిసి ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఒమర్ జలీల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు కేవలం 2 శాతం మాత్రమే టీడీఎస్ రూపంలో కోత విధిస్తూ సంబంధిత కమిషనర్ ఉత్తర్వులు వెలువరించారని ఈ సందర్భంగా కమిషనర్ కు గుర్తు చేసినట్లు కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఒమర్ జలీల్ ఆదాయపన్ను శాఖ తో మాట్లాడి టిడిఎస్ మినహాయింపుపై తగిన నిర్ణయం తీసుకొంటానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కొప్పిశెట్టి ఒక ప్రకటన విడుదల చేశారు.